Header Banner

జుట్టు రాలడానికి అసలు కారణం ఇదే? వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలో తెలుసా?

  Sun Feb 16, 2025 19:17        Life Style

తలస్నానం మన శరీర శుభ్రతకు, ఆరోగ్యానికి ముఖ్యమైది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అయితే, వారానికి ఎన్ని సార్లు తలస్నానం చేయాలి? రోజూ చేయాలా? లేక తక్కువగా చేయాలా? అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే వ్యక్తిగత జీవనశైలి, వ్యక్తిగత జుట్టు రకం, తల చర్మ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, వాతావరణం, జుట్టు రకాన్ని బట్టి మారవచ్చు. కొంత మందికి రోజూ తలస్నానం చేయడం అవసరం అయితే, మరికొందరికి వారానికి 2-3 సార్లు సరిపోతుంది. 

 

జుట్టు ఆరోగ్యంగా, మెరిసేలా, ఒత్తుగా పెరగాలంటే సరైన షాంపూ ఫ్రీక్వెన్సీ పాటించడం అవసరం. ఎక్కువసార్లు తలస్నానం చేయడం వల్ల తలకు అవసరమైన సహజ తేమ పోయి, జుట్టు పొడిబారే అవకాశం ఉంది. తక్కువసార్లు చేస్తే చెమట, పొడిబారడం, వేళ్ళ మధ్య ధూళి చేరడం వల్ల జుట్టు నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. 

 

ఆయిల్ స్కాల్ప్ ఎక్కువ ఉన్నవారు వారానికి 3-4 సార్లు తలస్నానం చేయాలి.ఎక్కువ తైలం ఉత్పత్తి అయ్యే తల చర్మం ఉన్నవారు రోజువారీగా చేయడం మంచిది. తక్కువ కెమికల్స్ ఉన్న జెంటిల్ షాంపూ ఉపయోగించడం మంచిది. పొడిబారిన జుట్టు వారానికి 1-2 సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. ఎక్కువసార్లు చేస్తే తల చర్మం తేమ కోల్పోయి, జుట్టు నరుసులు సులభంగా విరిగిపోవచ్చు. తేమను కాపాడే హెర్బల్ లేదా నేచురల్ షాంపూలు వాడాలి. 

 

ఇలాంటి వారు వారానికి 2-3 సార్లు తలస్నానం చేయడం సరిపోతుంది. తల చర్మం చిట్లకుండా ఉండటానికి కండిషనర్ వాడటం మంచిది. క్లోరీన్ లేదా ధూళి ఎక్కువగా ఉన్నవారు స్విమ్మింగ్ చేసే వ్యక్తులు తర్వాత వెంటనే తలస్నానం చేయాలి. ధూళి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసే వారు వారానికి 3-4 సార్లు తలస్నానం చేయడం మంచిది. వాతావరణాన్ని బట్టి తలస్నానం చేయాలి. ముఖ్యంగా వేసవి కాలంలో చెమట ఎక్కువగా వదులుతుండటంతో వారానికి 3-4 సార్లు చేయడం మంచిది. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు వారానికి 1-2 సార్లు మాత్రమే చేయడం ఉత్తమం. 

 

ఇది కూడా చదవండి: మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రోజూ తలస్నానం చేయడం తప్పు కాదు కానీ, హార్ష్ షాంపూలను వాడితే తల చర్మం పొడిగా మారుతుంది. అంతే కాదు ఎక్కువ నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుందనుకోవడం అపోహ మాత్రమే. సరైన షాంపూ, కండిషనర్ ఉపయోగించుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువగా చెమట పడే వారికి తలస్నానం తప్పనిసరి. 

 

తలస్నానం చేసేముందు కనీసం 30 నిమిషాల ముందు తైలాభ్యంగం చేయడం మంచిది. వేడి నీటితో తలస్నానం చేయకూడదు, గోరువెచ్చని నీరు ఉపయోగించాలి. కడిగిన తర్వాత మృదువైన టవల్‌తో తడిమి, జుట్టును తక్కువ వేడి గాలితో ఆరనివ్వాలి. హెయిర్ డ్రైయర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు బలహీనపడవచ్చు. తలస్నానం చేసిన తర్వాత సున్నితమైన హెర్బల్ హెయిర్ ఆయిల్ అప్లై చేయడం మంచిది. 

 

జుట్టు రకం, వాతావరణం, జీవనశైలి ఆధారంగా తలస్నానం ఫ్రీక్వెన్సీ మారుతుంది. అయితే జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే షాంపూ ఎంపిక, తేలికపాటి ఆయిల్ మసాజ్, తగినంత నీరు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరం. మందులు కలిగిన షాంపూలకు బదులుగా సహజమైన హెర్బల్ ఉత్పత్తులు ఉపయోగించడం ఉత్తమం. మీ తల చర్మానికి తగ్గట్టు షాంపూ ఎంపిక చేసుకుని, తగిన సమయంలో తలస్నానం చేయడం ఆరోగ్యకరం. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #LifeStyle #Health #HairFall #HairLoss #HairWash #HeadBath